ఓ తేనె పలుకుల అమ్మాయి
నీ తీగ నడుములో
సన్నాయి లాగిందే
ఓ కోర మీసపు అబ్బాయి
నీ ఓర చూపుల లల్లాయి
బాగుందోయ్ ఓ ఓ
నీ చెంపల నులుపు
బుగ్గల ఎరుపు ఊరిస్తున్నాయ్
నీ మాటల విరుపు
ఆటల ఒడుపు
గుండె పట్టుకొని ఆడిస్తున్నాయ్
నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్
ముద్దు ముద్దు నీ మాట చప్పుడు
నిద్దరొద్దు అంటుందే
పొద్దు మాపులు ముందు ఎప్పుడు
నిన్ను తెచ్చి చూపిస్తుందే
పూల తోటలో గాలి పాటలో
దాని అల్లరి నీదే
చీరకట్టులో ఎర్రబొట్టులో
బెల్లమెప్పుడు నీదే
నీ నవ్వుల తెలుపు మువ్వల కులుకు
ముందుకెళ్ళమని నెట్టేస్తున్నాయ్
నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్
గోడ చాటు నీ దొంగ చూపులు
మంట పెట్టి పోతున్నాయ్
పట్టు పరుపులు మల్లె పాన్పులు
నచ్చకుండా చేస్తున్నాయ్
మూతి విరుపులు తీపి తిప్పలు
రెచ్చగొట్టి చూస్తున్నాయ్
సోకు కత్తులు హాయి నొప్పులు
నొక్కి నొక్కి నవ్వుతున్నాయ్
నీ తిప్పల తలుపులు
మోహపు తలుపులు
తియ్య తియ్యమని బాదేస్తున్నాయ్
నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్
ఓ తేనె పలుకుల అమ్మాయి
నీ తీగ నడుములో
సన్నాయి లాగిందే