నీతో నడిచిన నిమిషం నిమిషం
చూపులు కలిసిన తరుణం తరుణం
ఏదో తెలియని మధనం మధనం
కాదా ఇది తొలి ప్రణయం ప్రణయం
నాలో పరుగులు తీసే మనసే నీకై వెతికేను తెలుసునా
నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరేనా
ఎన్నడూ కదలని నా మదే నీ వెన్నంటే పదమని తరిమేనే
ఎవరు నువ్వని అడగకే ఈ రెప్పలా చాటున దాచుకుంది నిన్నే
ఊరికే అల్లరి హృదయం హృదయం
నిన్నే వలచిన సమయం సమయం
సాగే ఇరువురి పయనం పయనం
ఏ దరి చేర్చునో పరువం పరువం
నాలో పరుగులు తీసే మనసే నీకై వెతికేను తెలుసునా
నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరేనా
పట్టుకున్న చెయ్యే ప్రాయం అల్లుకుంది
వెల్లువైన హాయే మనసు పడమంది
అతడినే తలపులో నిలబెడుతోంది
అందినట్టే అంది ఆశపెడుతుంది
కళ్ళతోటి నవ్వి మాయమవుతోంది
ఇటు సగం అట్టు సగం ఒక్కటవుతుంది
కోరని ఓ వరమే నువ్వై ఎదురుగా నిలిచినది
తీరని ఏ రుణమో నీతో ముడిపడమంటోంది
ఊరికే అల్లరి హృదయం హృదయం
నిన్నే వలచిన సమయం సమయం
సాగే ఇరువురి పయనం పయనం
ఏ దరి చేర్చునో పరువం పరువం
నాలో పరుగులు తీసే మనసే నీకై వెతికేను తెలుసునా
మోడై నిలిచినా నిన్నటి వయసే పూచిన కథలే తెలుపనా
ఉప్పిరున్నా శీలాయి బతుకుతున్నలే
ఉన్న పాటుగా నీ నిన్ను కలిశాలే
నీ జాతే దొరికితే మనీష్ అవుతలే
తునిగాళ్లే రోజు తుళ్ళి తిరిగాలే
నిన్ను చూడగానే ఈడునేరిగాలే
ఆయువే తీరినా నిన్ను విడనులే
తీయని నీ కలలే కంటూ తోడుగా ఉంటాలే
ఒంటరి మనసుకు నీ స్నేహం ఊపిరి పోసెనులే
ఊరికే అల్లరి హృదయం హృదయం
నిన్నే వలచిన సమయం సమయం
సాగే ఇరువురి పయనం పయనం
ఏ దరి చేర్చునో పరువం పరువం