ముసలి తథా ముడత ముఖం
మురిసి పోయెనే
గుడిసె పాక గుద్ది దీపం
మెరిసిపోయినే
రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్లో గంట
రంగ రంగ సంబరంగా మొగెనె
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గోడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ (x2)
కత్తి సుత్తి పలుగు పారా తీయండి
మన కష్టం సుక్కలు
కుంకుమ బొట్టుగా పెట్టండి
అన్నం బెట్టే పనిముట్లే మన దేవుళ్ళు
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి
అమ్మోరు కన్ను తెరిసిన నవ రాతిరి
ఇన్నాళ్ల శిమ్మ సీకటి తెల్లారే సమయం కుదిరి
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గోడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
ఓ మట్టి గోడలు చెబుతాయి
సీమ మనుషుల కష్టాలు
ఏ దారి గతుకులు చెబుతాయి
పల్లె బతుకుల చిత్రాలు
పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు
మరి పెరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపుగా
అస్సలైన పండుగ ఎప్పుడంటే
ఆ కన్నా తల్లి కంటి నీరు
తుడిచినా రోజేగా
ఓ నాడు కల కల వెలిగిన రాయలోరి సీమిది
ఈనాడు వెలవెల బోతే
ప్రాణమంతా చిన్న బోతుంది
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గోడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
ఏ చేతి వృత్తులు నూరారు
చేవగలిగిన పని వారు
చెమట బొట్టు తడిలోనే
తళుక్కుమంటాది ప్రతి ఊరు
ఎండ పొద్దుకు వెలిగిపోతారు
ఈ అందగాళ్ళు వాన జల్లుకు మెరిసిపోతారు
ఎవ్వడు కన్నా తక్కువ పుట్టారు వీళ్ళందిరి లాగే
బాగా బతికే హక్కులు ఉన్నోళ్లు
పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని
ఒట్టి జోల పాట పడ్డాకా
తల్లడిల్లు తల రాతలకు
సాయమేదో చేయాలంటా
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గోడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి