అరె గుండెలోన చప్పుడే
లవ్వు గంట కొట్టెరో
హే నేలపైన అడుగులే
కొత్త స్టెప్పులేసేరో
అరెరెరే నీలిరంగు నింగిలోన
గువ్వల గుంపు ఎగిరినట్టు
ఊహలన్ని ఒక్కసారి రెక్కలిప్పెరో
ఎహె గాలిలోన దూది లాగా
తేలి తేలి పోయినట్టు
గాలి ఏదో సోకినట్టు గోలగుందిరో
ఓ వెన్నెలా నీ మాయిలా
నా పైనిలా చల్లి పోకలా
ఓ వెన్నెలా నా రాణిలా
నూరేళ్లిలా ఉండిపో ఇలా
ఓ ఓ ఓ ఒసేయ్ అందాల చిట్టి
ఓహో కాలికున్న మువ్వల పట్టి
ఆహా మనసునే బాగా చుట్టి
లంగరేసి లాగేస్తున్నావే
కళ్లకే కాటుక చుట్టి
ఓహో కాలరే గట్టిగా పట్టి
ఆహా మెల్లగా మత్తులో నెట్టి
నన్నే ఇలా ముంచేత్తున్నావే
ఓయ్ మాటల మారి
నీ పక్కన చేరి
నా దిక్కులు మారి
కొత్తగా అయిపోయా
నువ్వంటే నాకు ఎంతో నచ్చి
చెప్పలేనంత ఎక్కింది పిచ్చి
తాళి తీసుకొని కట్టెయ్ వచ్చి
నీ కోసమే పుట్టానురో
హ హ ఓ వెన్నెలా
ఈ హయిలా
నా పైనిలా
చల్ల గాలిలా
ఓ వెన్నెలా
నీ రాణిలా
నూరేళ్లిలా
ఉండనా ఇలా
ఒసేయ్
వెన్నెల
ఓయ్ అరెరెరే
యహే ఉండిపో ఇలా
ఉండనా ఇలా