చందమామ వచ్చిన చల్లగాలి వీచిన
చిచ్చు ఆరాదెలనమ్మా
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా
చందనాలు పూసిన ఎంత సేవ చేసిన
చింత తీరేదెలనమ్మా
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకొమ్మ
జంట లేదనా అహహా
ఇంత వేదనా ఓహోహో
జంట లేదనా ఇంత వేదనా
ఎంత చిన్నబోతివమ్మ
చందమామ వచ్చిన చల్లగాలి వీచిన
చిచ్చు ఆరాదెలనమ్మా
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకొమ్మ
ఓఓఓ మురిపాల మల్లికా
దరిజేరుకుంటినే పరువాల వళ్ళిక
ఇది మారులుగొన్న మహిమో
నిను మరువలేని మైకమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
మరు మల్లెల సరమో వీరి విల్లులా శరమో
మరు మల్లెల సరమో వీరి విల్లులా శరమో
ప్రణయాను బంధమెంత చిత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
విరిసిన వనమో యవ్వనమో
పిలిచింది చిలిపి వేడుక కిలకిలా పాటగా
చలువల వరమో కలవరమో
తరిమింది తీపి కోరికా చెలువను చూడగా
దరిశనమీయవే సరసకు చేరగా
తెరలను తీయవే తళుకుల తారక
మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
కళలను రేపే కల ఉంది
అలివేణి కంటి సైగలో
జిగిబిగి సోకులో
ఎడదను ఊపే ఊడుపుంది
సుమబాల తీగ మేనిలో
సొగసుల తావిలో
కదలని ఆటగా నిలిచినా వేడుక
బదులిడ రావుగా పిలిచినా కోరిక
బిడియంఅదెలా ప్రియురాలా మణిమేఖల
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
మరు మల్లెల సరమో వీరి విల్లులా శారమో
మరు మల్లెల సరమో వీరి విల్లులా శారమో
ప్రణయను బంధమెంత చిత్రమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో