ఘాటైన ప్రేమ ఘటన
దీటైన మేటి నటన
అందంగా అమరిందిలే
ఇక ఆనందం మిగిలుందిలే
నిజమెరుగవే పసిచిలక
ఘాటైన ప్రేమ ఘటన
దీటైన మేటి నటన
ఆనందం చిందించేలే
నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలగునులే
కోరుకున్నవాడే
తగు వేళా చూసి జాతకుడే
సుముహూర్తం ఎదురైనది
అందమైన ఈడే
అందించమంటూ దరిచేరే
సందేశం ఎద విన్నది
లేని పోనీ లోని శంక
మానుకోవే బాలిక
ఏలుకోవా గోరువంక
లేతమేని కానుక
కులుకా రసగుళిక కలలొలుక
తగు తరుణము దొరికేనుగా
ఘాటైన ప్రేమ ఘటన
దీటైన మేటి నటన
ఆనందం చిందించేలే
నా అందం నీ వశమాయెలె
తెరమరుగిక తొలగునులే
పూజలన్నీ పండే
పురివిప్పి మెనూ జతులాడే
అనురాగం శృతి చేయగా
మోజులన్నీ పిండే
మగతోడు చేరు ఈనాడు
సుఖభోగం మొదలౌనుగా
ఊసులన్నీ మాలగా
పూసగుచ్చి వేయనా
రసకన్నె నేలగా
దూసుకొచ్చి వాలన
కరిగా తొలకరిగా రసజరిగా
అనువనువొక చినుకవగా
ఘాటైన ప్రేమ ఘటన
దీటైన మేటి నటన
అందంగా అమిరిందిలే
ఇక ఆనందం మిగిలుందిలే
నిజమెరుగవే పసిచిలక
ఘాటైన ప్రేమ ఘటన
దీటైన మేటి నటన
ఆనందం చిందించేలే
నా అందం నీ వశమాయెలె
తెరమరుగిక తొలగునులే