యానాం పంతులుగారు ఎపుడో చెప్పేశారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
యానాం పంతులుగారు ఎపుడో చెప్పేశారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
నీ నా ఇంటిపేరు ఎపుడో కలిపేశారు
ఇకపై మిగిలిందొకటే దండల తార్మారు
కృష్ణ మాయే నీకు నాకు ఇలా వేసినాదే పూల సంకెల
దక్కినావే కన్నె రాధలా నా మనసే విన్నట్టే
తేలిపోయా నింగి తారల పేలి పోయా గాలి బూరల
ఇంత హాయా కుందనాల బొమ్మలాగ నాతో నువ్వుంటే
యానాం పంతులుగారు ఎపుడో చెప్పేశారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
హే ఒక్కటంటే ఒక్క జీవితం నువ్వు పక్కనుంటే ఎంత అద్భుతం
నువ్వుగా వందేళ్ళ పండుగై నా గుండె నిండెనే స్వర్గాల అమృతం
హే బుజ్జి గుండె తెల్ల కాగితం దానిపైన నువ్వు ప్రేమ సంతకం
నవ్వులే గులాబి పువ్వులై నీ కాలి బాటకు వరాల స్వాగతం
సీతాకోక నువ్వుగా నీపై చుక్క నేనుగా
చుక్కల్దాకా సాగెనే నాలో సంబరం
అందమైన మత్తు మందులా లక్ష కోట్ల లంకె బిందెలా
చేరినావే ప్రేమలేఖలా నా రంగుల రసగుల్లా
యానాం పంతులుగారు ఎపుడో చెప్పేశారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
నీ నా ఇంటిపేరు ఎపుడో కలిపేశారు
ఇకపై మిగిలిందొకటే దండల తార్మారు