కన్నుకొట్టినా నన్ను కుట్టవా రేగే తేనిగా
కంటచూసినా కందిపోతావే తూగే తూనీగా
కన్నుకొట్టినా నన్ను కుట్టవా రేగే తేనిగా
కంటచూసినా కందిపోతావే తూగే తూనీగా
అయినా సరే అన్నగా సిద్ధంగానే వున్నాగా
అందం మందారంలా కందేందుకే అందిస్తున్నాగా
దేవుడా అమ్మాయంటే ఇలా కూడా ఉంటుందా
ఎక్కడా మచుకూడా ఆడాలక్షణం లేకుండా
ఇంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నిందా
అందుకే తప్పనిసరై ముందడుగేసా కాస్తంతా
కన్నుకొట్టినా నన్ను కుట్టవా రేగే తేనిగా
కంటచూసినా కందిపోతావే తూగే తూనీగా
పెదవిచ్ఛే వరం వొద్దనుకుంటావా
విదిలించి వ్రతం ముద్దనుకుంటావా
బెదిరించే గుణం ప్రేమని అంటావా
శృతిమించి తనం క్షేమం అంటావా
వెచ్చగా నిచ్చెలి వస్తే వెళ్ళిపోమంటావా
వెల్లువై ముంచుకువస్తే తాళాదే పడవ
నది లోటేంతుందో ఒడ్డున ఉండే చూస్తూ ఉంటావా
దేవుడా అమ్మాయంటే ఇలా కూడా ఉంటుందా
ఎక్కడా మచుకూడా ఆడాలక్షణం లేకుండా
ఇంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నిందా
అందుకే తప్పనిసరై ముందడుగేసా కాస్తంతా
వాస్తు లోపం ఉందా నా ఒంటి ఒంపుల్లో
దృష్టి దోషం ఉందా నీ కంటి చూపుల్లో
ఈడు తాపం ఇలా వీధేక్కు చిందుల్లో
ఏమి లాభం పిల్లా ఇబ్బందితనంలో
యవ్వనం నివ్వెరపోదా కొరికే లేదంటే
చెప్పినా నమ్మవుకదా తీరికే లేదంటే
అరె పాపం అని పాపాయిని పాలించలేవా
దేవుడా అమ్మాయంటే ఇలా కూడా ఉంటుందా
ఎక్కడా మచుకూడా ఆడాలక్షణం లేకుండా
ఇంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నిందా
అందుకే తప్పనిసరై ముందడుగేసా కాస్తంతా
కన్నుకొట్టినా నన్ను కుట్టవా రేగే తేనిగా
కంటచూసినా కందిపోతావే తూగే తూనీగా
అయినా సరే అన్నగా సిద్ధంగానే వున్నాగా
అందం మందారంలా కందేందుకే అందిస్తున్నాగా
దేవుడా అమ్మాయంటే ఇలా కూడా ఉంటుందా
ఎక్కడా మచుకూడా ఆడాలక్షణం లేకుండా
ఇంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నిందా
అందుకే తప్పనిసరై ముందడుగేసా కాస్తంతా