అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
సంక్రాంతే ప్రతి దినం
సుఖ శాంతే ప్రతి క్షణం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
కనులు వేరు చూపులు ఒకటే
తలలు వేరు తలపులు ఒకటే
పంచుకున్న ప్రాణం ఒకటే
ఎదలు వేరు స్పందన ఒకటే
పెదవిలోని ప్రార్ధన ఒకటే
ఒకరి కన్నా ఇష్టం ఒకరే
కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లెనూ
కన్నీరై ఎవరున్నా పది చేతులొచ్చి తుడిచేనూ
సమభావం అన్నది సంసారం అయినది
నా ఇల్లు మమతాలయం కవి లేని కవితాలయం
అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
కులుకు లేని వాకిలి మాది
అలక లేని అరుగే మాది
మారక లేని మనసే మాదీ
తెరలు లేని తలుపే మాది
గొడవలేని గడిపే మాది
కరువు లేని కరుణే మాదీ
ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే
ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే
స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా
మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంధాలయం
అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం