నచ్చావురా వదలనురా వదలనురా
మెచ్చానురా జతపడరా జతపడరా
వరసై నచ్చి అడిగా లేరా
వరమే ఇచ్చే ఈ జల ధార
నీతో ఏడడుగులు
నడవాలన్నది నా కోరిక రా
నీడగా తోడుండమే
ఇక నా తీరిక రా
నచ్చావురా వదలనురా వదలనురా
మెచ్చానురా జతపడరా జతపడరా
కనిపించే దాకా చేస్తా తపసు
దేవుడు కనిపిస్తే ఏమడగలో తెలుసు
నువ్వంటే పడి చస్తుంది వయసు
నీ వైపే లాగేస్తోంది మనసు
అలకైనా కులకైనా నువ్వు నాతోనని
చావైనా బతుకైనా నే నీతోనని
విన్నానులే ప్రియా నీ మౌన భాషణం
వస్తానులే ప్రియా
వందేళ్ల ప్రేమ బంధాలే పండించేలా
నచ్చావురా వదలనురా వదలనురా
మెచ్చానురా జతపడరా జతపడరా
అరుణాకర మానసహియోరె
కరీమీయమ సనిమాయామోరి
అరుణాకర మానసహియోరె
కరీమీయమ సనిమియామోరి
బరువెక్కిందంమో బ్రహ్మచర్యం
జరగాలంటుందే ఆ శుభకార్యం
అలవాటైపోతుందే నీ ధ్యానం
ఎదో పొరపాటే చేసేయమంది ప్రాణం
జలధారే పులకించింది నిన్నే తాకి
కలిగేనా ఆ అదృష్టం నాకు మరి
కాదన్నానా సఖ కానిచ్చే వేడుక
లేదంటానా ఇక
లెమ్మంటే లేచి నీ వొళ్ళో వాలేయక
నచ్చావురా వదలనురా వదలనురా
మెచ్చానురా జతపడరా జతపడరా