అదిరే అదిరే జత కుదిరే
కుదిరే కుదిరే నది కుదిరే
అలరే అలరే కళలలరే
హృదయం కోయిల కిలకిలలే
కదిలే కదిలే పూల రథం
మొదలే మొదలే ప్రేమ పదం
అందెలు తొడిగెనులే పాదం
చిందులు వేసెను గుండె రిథమ్
స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో శ్రామికుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
నీ కోసం వచేసాడు
ఆకాశం తెచ్చేసాడు
అడగక ముందే అందించే
సాయం ఇతడు
స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో
ఎగిరే ఎగిరే ఆకాశం
గువ్వై రెమ్మన వాలినదా
చిగురులు తొడిగే అవకాశం
మల్లి తోటకు వచ్చినదా
నవ్వులు పువ్వులు దరహాసం
పెదవుల పడవై సాగినదా
రంగులు రవ్వల సంతోషం
మనసుని మబ్బుల విసిరినదా
మండుతున్న ఎండలోనే
నీడ కాసే గొడుగు వీడు
చేదు నిండే గుండెలోన
తిప్పి పుట్టే కబురు వీడు
ఏ చిన్ని భారం నీ మీదున్న
మోసే హృదయం ఇతడు
పసివాడి కన్నులతోనా
లోకాన్నే చూస్తాడు
దండించే వాడికి తానే
దండనౌతూ కూడా
ప్రేమ పంచిస్తాడు
స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో
రాతలోన గీతలోన
భాగ్యరేఖై పూసినాడు
అందమైన జాతకంలా
సంబరాలే తెచ్చినాడు
నే చిన్ని చిన్ని సరదాలని
తీర్చే తొలి స్నేహితుడు
ఏ పరిచయం లేకున్నా
ప్రాణం పంచిస్తాడు
సెలవంటూ వెళ్లిపోతున్నా
పండుగల్ని చేవులు
తిప్పి లాక్కొస్తాడు
స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో
ఎగిరే ఎగిరే ఆకాశం
గువ్వై రెమ్మన వాలినదా
చిగురులు తొడిగే అవకాశం
మల్లి తోటకు వచ్చినదా
నవ్వులు పువ్వులు దరహాసం
పెదవుల పడవై సాగినదా
రంగులు రవ్వల సంతోషం
మనసుని మబ్బుల విసిరినదా