వీరుడేనా వీడినేనా నేను కోరుకున్న
దగ్గరయ్యే వాడేనా
దాచుకొన ఊరు వాడ మెచ్చినోడు వీడేనా
నాకు కూడా మెచ్చినోడు నాకేనా ఏనాటికైనా
రేపు వైపు చూపు లేని కళ్ళతోన
కొత్త ఆశ చూస్తున్న వాడి వలన
లోకమంతా ఏకమైనా వాడి వెంటెయ్
సాగిపోనా నీడ లాగ మారిపోనా
నిన్ను నన్ను ఇలా ఏకం చేసే
కల తీరేలా దారి చేరేదెలా
చేరువైన దూరమైన ప్రేమలోన
వాడి ఊహే హాయేగ
గుండెలోన జాలు వారే ఊసులన్నీ
వాడితోనే పంచుకొన ఊపిరల్లే ఉండి పోనా
ఏలుకోడా ప్రాణమల్లె చూసుకోడా
నన్ను కూడా నా లాగే కోరుకొడా
బాధలోనూ వెంట రాడా బంధమల్లె అల్లుకోడా
వీడిపోని తోడు కాడ