గగనపు వీధి వీడి వలసబండి
పోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే
ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నెల
జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే
తనవాసం వనవాసం
భైరవుడో భార్గవుడో
భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కుడైన లాంటి వంటి నైజం
వీడు మెరుపులన్నీ ఒక్కటైనా తేజం
రక్షకుడో భక్షకుడో
పరీక్షలకే సుశిక్షితుడో
శత్రువంటి లేనిదింకా యుద్ధం
వీడి గుండె లోతు గాయమైన సిద్ధం
నడిచొచ్చే నర్తన శౌరి ఓహో ఓహోహో
పరిగెత్తే పరాక్రమ శైలి ఓహో ఓహోహో
హాలాహలం ధరించిన దగ్ధ హృదయుడో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరినా రాకెట్టు
గగనపు వీధి వీడి వలసబండి
పోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే
ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నెల
జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే
తనవాసం వనవాసం
దివి నుంచి భువి పైకి
భగ భగమని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడి వడిగా వడగాళ్ళై
దడ దడమని జారేటి
కనిపించని జడి వానేగా వీడు
శంఖంలో దాగేటి పోటెత్తిన
సంద్రం హోరితాడు
శోకాన్నే దాచేసే అశోకుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరినా రాకెట్టు
ఆ ఆ
తన పదవే వదులుకొని
పైకెదిగిన కొమ్మలకి
చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనే మార్చుకుని
ప్రభవించే సూర్యుడికి
తన తూరుపు పరిచయమే చేస్తాడు
రావణుడో రాఘవుడో మనసును
దోచే మాధవుడొ
సైనికుడో శ్రామికుడో
అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరినా రాకెట్టు
గగనపు వీధి వీడి వలసబండి
పోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే
ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నెల
జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే
తనవాసం వనవాసం