గాజు బొమ్మ తీరున
చూసే గుండె నీదిరా
గాయమైతే చూడలేవు
గారమంటే నీదిరా
ఎంత ఎంత కోరినా అంతులేని ప్రేమరా
గాలినైన తాకనీవు గారమంటే నీదిరా
చేతులెంత చాచినా మాటతీరు మారదే
వేచి చూసె కౌగిలే వచ్చి చేరెరా
నా కోపమైనా కోరికైనా ఒక్క నీకే చెప్పుకోనా
నా గుండెలోనా ఊపిరైనా ఆగుతున్నా చుట్టుకోనా
నా నిమిషమైనా ఉండలేను నువ్వు లేని భూమిపైనా
నా దేహమైనా వీడిపోనా నిన్ను నేనే నింపనా
గాజు బొమ్మ తీరున
చూసే గుండె నీదిరా
గాయమైతే చూడలేవు
గారమంటే నీదిరా
ఏ రోజిలా కాలేదులే పాదాలిలా తేలాయిలే
ఏం చేసినా నీ మీదకే తోసేస్తోంది నేలే
బాగుంది ఈ అల్లరే చిత్రంగా ఉన్నా సరే
వద్దన్నా నీ ఊహలే గుండెల్లో ఊరికే వాలే
ఏ కోపమైనా కోరికైనా ఒక్క నీకే చెప్పుకోనా
నా గుండెలోనా ఊపిరైనా ఆగుతున్నా చుట్టుకోనా
నీ ప్రేమలో ఓ నమ్మకం
చూశానులే ఈ లోపలే
పిల్లాడిలా అల్లేయడం
నచ్చేసింది నాకే
చూసేస్తా నీ నవ్వులే
దాచేస్తా కాలాలనే
సాగిస్తా నీ స్నేహమే
నీడల్లా మారనా నీకే
నా కోపమైనా కోరికైనా ఒక్క నీకే చెప్పుకోనా
నా గుండెలోనా ఊపిరైనా ఆగుతున్నా చుట్టుకోనా
నా నిమిషమైనా ఉండలేను నువ్వు లేని భూమిపైనా
నా దేహమైనా వీడిపోనా నిన్ను నేనే నింపనా