హ్మ్ ఉరికే నా సిలకా
నీ సక్కనైన పాట మెలిక
ఆ గట్టుదాటి పుట్టాదాటి
ఏడేడు ఏర్లు దాటి
గట్టుదాటి పుట్టాదాటి
ఏడేడు ఏర్లు దాటి
కొండా దాటి కోనా దాటి
కోసుకోస్లు దార్లు దాటి
సీమాసింతా నీడాకోచ్చానే
రంగు రంగు రాంసిలకా
సింగారాలా సోకులు చూసానే
రంగు రంగు రాంసిలకా
సింగారాలా సోకులు చూసానే
కళ్ళల్లోనా
కళ్ళల్లోనా పడ్డ అందం
గుండెల్లోన సేరేలోగా
కళ్ళల్లోనా వడ్డ అందం
గుండెల్లోన సేరేలోగా
రెక్కాలిప్పుకుని ఎగిరిపోయామే
రంగు రంగు రాంసిలకా
మనసునిరిచి మాయమయ్యావే
రంగు రంగు రాంసిలకా
మనసూనిరిసీ మాయమయ్యావే
తందర నానయ్యో తందర నానయ్యో
పందిరి సందట్లో అల్లరి ఏందయ్యో
తందర నానయ్యో సుందరి ఏదయ్యో
గుండెల దాచావా బైటికి తీవయ్యో
తియ తియ్యని తియ తియ్యని
తియ తియ్యని తేనెలూరు
లేతకెంపు పెదిమలు
వాలుకనులనెక్కుపెట్టి
సంపేసిన సూపులు
సానబెట్టి సూపినావే
నీ ఒంపు సొంపులు
సానబెట్టి సూపినావే
నీ ఒంపు సొంపులు
ఆకాశమెత్తు ఆశ పుట్టించి
రంగు రంగు రాంసిలకా
పాతాళంలో పాతిపెట్టావే
రంగు రంగు రాంసిలకా
పాతాళంలో పాతిపెట్టావే
నువులేక నే లేనని రాసావే రాతలు
బతుకంతా నాతోనే ఉంటానని కూతలు
కల్లబొల్లి మాటలతో కొసావే కోతలు
కల్లబొల్లి మాటలతో కొసావే కోతలు
మార్సు మీద మేడ సూపెట్టి
రంగు రంగు రాంసిలకా
మోహం మీద మట్టి కొట్టావే
రంగు రంగు రంగు రంగు
రంగు రంగురాంసిలకా
నా మోహం మీద మట్టి కొట్టావే
రంగు రంగు రాంసిలకా
నా మోహం మీద మట్టి కొట్టావే హేయ్య్