ఏకాంతంగా ఉన్న ఎందరి మధ్యన ఉన్న
నీకై నేను ఆలోచిస్తున్న
ఏ పని చేస్తూ ఉన్న ఎటు పయనిస్తూ ఉన్న
నిన్నే నేను ఆరాధిస్తున్న
ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్న
నిలువెల్లా కల్లై నీ కోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్న
నీ పెదవుల పిలుపుల కోసం పడి చస్తున్నా
నా తనువంతా మనసై ఉన్న
ఏకాంతంగా వున్నా ఎందరి మధ్యన ఉన్న
రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో
ఇంకా చెప్పని సంగతులెన్నో నా ఎద గొంతుల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘం లో
ఇంకా తిరగని మలుపులు ఎన్నో జత పడు మార్గం లో
మనసైన ఆకర్షణలో మునకేస్తున్న
ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్న
నా వయసెంత వలపై వున్నా
ఏకాంతంగా వున్నా ఎందరి మధ్యన ఉన్న
స్పందన నేనై ఉంటా నీ హృదయం లోన
చల్లని లాలన నేనై ఉంటా నీ అలసట లోన
అర్చన నేనై ఉంటా నీ వోడి గుడి లోన
వెచ్చని రక్షణ నేనై ఉంటా వోడి దుడుకుల్లోన
నీ జీవన నది లో పొంగే నీరవుతున్న
సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్న
సత్తా జన్మల ప్రేమవుతున్న
ఏకాంతంగా వున్నా ఎందరి మధ్యన ఉన్న