కమ్ముకున్నా చీకట్లోనా
కుమ్ముకోచే వెలుతురమ్మా
కచ్చగట్టి కత్తి పడిథెయ్
చిచ్చురేపేయ్ కాళీవమ్మా
నీ కన్ను ఉరుమి చూడగానే
దూసినా కత్తి వణికి పోవునమ్మా
కుంచె పట్టి బొమ్మ గీస్తేయ్
అదే నీ గుండె కె అద్దమమ్మా
అందరినీ ఆదరించే దయామయి
అన్నపూర్ణ నీవమ్మా
ఆలనా పాలనలో నువ్వేయ్
ఈ నెలకు తల్లివమ్మా
నువ్వు పలికేదే తిరుగులేని వేదం
నువ్వు చేసేదే ఎదురులేని చట్టం
ఓర్పులోన ధరణి మాతావమ్మా
తీర్పులోన ధర్మ మూర్తివమ్మా
జేజమ్మా మాయమ్మ
జేజమ్మా ఓయమ్మా
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా
జేజమ్మా మాయమ్మ
జేజమ్మా ఓయమ్మా
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా
నువ్వు రుద్రరూప మెత్తగానే
కాలమే దద్దరిల్లి పోయెనమ్మా
రుద్ర శక్తులకు నీ ధాటితో గుండెలెయ్
బద్దలైపోయెనమ్మ
బుసగొట్టెయ్ కామాంధుని
కసితీరక తొక్కావమ్మా
పుట్టుగడ్డ ఆదుకున్న
ఆ అపర భద్రకాళి నీవమ్మా
మాట నిలుపుకొంటివమ్మా జేజమ్మా
మల్లి జన్మ ఎథినావమ్మ
ఎంత దీక్ష పూనినవమ్మా
గుండెలో నిప్పులెయ్ నింపినావమ్మా
త్యాగమంటేయ్ నీధమ్మా
నరకమే కొంగులోనా ముడిచావమ్మా
నిన్ను చూసి మృత్యువుకీ జేజమ్మా
కళ్ళు చెమ్మగిల్లినాయమ్మా
ఈ జారుతున్న రక్తధారలేయ్
నీ తెగువకు హారతులు పట్టెనమ్మా
ఆ ఆ దిక్కులన్నీ సూన్యమాయె
వెలుతురంతా చీకటాయె
ఆశలన్నీ ఇంకిపోయే
శ్వాస మాత్రం మిగిలిపోయే