చీకటిలాంటి పగటిపూట
కత్తుల్లాంటి పూలతోట
జరిగిందొక్క వింతవేట
పులిపై పడిన లేడి కథ వింటారా
హే జాబిలీ రాణి రాతిరంతా
జాలే లేని పిల్ల వెంట
అలికిడిలేని అల్లరంతా
గుండెల్లోకి దూరి అది చూస్తారా
చుట్టూ ఎవ్వరు లేరు
సాయం ఎవ్వరు రారు
చుట్టూ ఎవ్వరు లేరు
సాయం ఎవ్వరు రారు
నాపై నేనే ప్రకటిస్తున్న
ఇదేమి పోరు
అణగణగనగా అరవింద అట తన పేరు
అందానికి సొంతూరు
అందుకనే ఆ పొగరు
అరెరెరెరెరెరె అటు చూస్తే కుర్రాళ్ళు
అసలమైపోతారు
అన్యాయం కదా ఇది అన్నారు ఎవరు
ప్రతి నిముషము తనవెంట
పడిగాపులు పడుతుంటే
ఒకసారి కూడా చూడకుండా క్రీగంట
ఏమున్నదో తన చెంత
ఇంకెవరికి లెదంతా
అయస్కాంతమల్లె లాగుతుంది
నన్ను చూస్తూనే ఆ కాంత
తాను ఎంత చేరువనున్న
అద్దంలో ఉండే ప్రతిబింబం అందునా
అంతా మాయల ఉంది
అయినా హాయిగా ఉంది
భ్రమల ఉన్న బానే ఉందే
ఇదేమి తీరు
మనవే వినవె అరవింద
సరేలే అనవే కనువిందా
వలపే మనకి రాసిందే
కాదంటే సరిపోతుందా
మనవే వినవె అరవింద
సరేలే అనవే కనువిందా
వలపే మనకి రాసిందే
కాదంటే సరిపోతుందా
అణగణగనగా అరవింద అట తన పేరు
అందానికి సొంతూరు
అందుకనే ఆ పొగరు
అరెరెరెరెరెరె అటు చూస్తే కుర్రాళ్ళు
అసలమైపోతారు
అన్యాయం కదా ఇది అన్నారు ఎవరు
మనవే వినవె అరవింద
సరేలే అనవే కనువిందా
వలపే మనకి రాసిందే
కాదంటే సరిపోతుందా
మనవే వినవె అరవింద
సరేలే అనవే కనువిందా
వలపే మనకి రాసిందే
కాదంటే సరిపోతుందా
పులిపై పడిన లేడి కథ వింటారా