నీడల్లే తరుముతూ ఉంది గతమేదో వెంటాడి
మౌనంగా పైబడుతుంది ఉరమేదో ఉండుండి
శ్వాసల్లో ఉప్పనై చూపుల్లో చీకటై
దిక్కుల్లో సూన్యమై సూన్యమై
నీడల్లే తరుముతూ ఉంది గతమేదో వెంటాడి
నిప్పు పై నడకలో తోడుగా నువ్వుండగా
ఒక బంధమే బూడిదై మంటలె మది నిండగా
నీ బాధ ఏ కొంచెమో నా చెలిమితో తీరదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదో తెలియని ఈ పయనంలో
నీడల్లే తరుముతూ ఉంది గతమేదో వెంటాడి
ఎందుకో ఎప్పుడో ఏమిటో ఎక్కడో
బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగా
భయమన్నదే పుట్టదా
ప్రతి ఊహతో పెరగదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదో తెలియని ఈ పయనంలో
నీడల్లే తరుముతూ ఉంది గతమేదో వెంటాడి
మౌనంగా పైబడుతుంది ఉరమేదో ఉండుండి
శ్వాసల్లో ఉప్పనై చూపుల్లో చీకటై
దిక్కుల్లో సూన్యమై సూన్యమై