సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చిన్నబోయినవెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలవెందుకే
నడిరేయి జాములో తడి లేని సీమలో
సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చిన్నబోయినవెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలవెందుకే
బతుకే బరువు ఈ నెలకి కరుణే కరువు ఈ నీటికి
వెలుగే రాదు ఈ వైపుకి శ్వాసే చేదు ఈ గాలికి
ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి
ఆ సూన్యమే తోడున్నది ఈ చిన్ని ప్రాణానికి
నిదురించునే నీ తూరుపు నిట్టూర్పే ఓదార్పు
అందాల చిలుక అపరంజి మొలక అల్లాడకే అంతగా
పన్నీటి చినుకా కన్నీటి మునక కలలన్ని కరిగించగా
ఏవైపున్నదో ఏమో మరి జాడే లేదే దారి దరి
ఏమవుతుందో నీ ఊపిరి వేటాడిందే కాలం మరి
నీ గుండెల్లో గోదావరి నేర్పాలి ఎదురీతని
నీకళ్ళలో దీపావళి ఆపాలి ఎద కోతని
పరుగాపని పాదాలతో కొనసాగని నీ యాత్రని
శ్రీ వెంకటేశా ఓ శ్రీనివాస నీ మౌనం ఎన్నాళ్లయా
ఆలా వైకుంఠాన అంతః పురాణ ఏఏ మూల వున్నావయ్యా
ఓ నామాల దేవరా నీ మాయ ఆపర
శ్రీ వెంకటేశా ఓ శ్రీనివాస నీ మౌనం ఎన్నాళ్లయా
ఆలా వైకుంఠాన అంతః పురాణ ఏఏ మూల వున్నావయ్యా
Sooreedupuvva jaabilli guvva chinaboyinaavenduke
maakanti chaluva koneti kaluva kanneeti koluvenduke
nadireyi jaamulo tadi leni seemalo
Sooreedupuvva jaabilli guvva chinaboyinaavenduke
maakanti chaluva koneti kaluva kanneeti koluvenduke
Batuke baruvu ee nelaki karune karuvu ee neetiki
veluge raadu ee vaipuki swaase chedu ee gaaliki
aakaasame migilunnadi ekaaki payanaaniki
aa soonyame todunnadi ee chinni praananiki
nidurinchune nee toorupu nittoorpe odaarpu
Andaala chiluka aparanji molaka allaadake antagaa
panneeti chinukaa kanneeti munaka kalalanni kariginchagaa
Yevaipunndo yemo mari jaade lede daari dari
yemavutundo nee oopiri vetaadinde kaalam mari
nee gundello godaavari nerpaali yedureetani
neekallalo deepavali aapali yeda kootaki
parugaapani paadalato konasaagani nee yaatrani
sri venkatesaa o srinivaasa nee mounam yennaallayaa
ala vaikuntaana antaha puraana ee moola vunnaavayya
o naamaala devaraa nee maaya aapara
sri venkatesaa o srinivaasa nee mounam yennaallayaa
ala vaikuntaana antaha puraana ee moola vunnaavayya