కళ్యాణం కానుంది కన్నె జానకిక్కి
కళ్యాణం కానుంది కన్నె జానకిక్కి
వైభోగం రానుంది రామ చంద్రుడికి
వైభోగం రానుంది రామ చంద్రుడికి
దేవతలే దిగి రావాలి జరిగే వేడుకక్కి
రావమ్మా సీతమ్మ సిగ్గు దొంతరల్లో
రావయ్యా రామయ్య పెళ్లి శోభలతో
వెన్నెల్లో నడిచే మబ్బులాగా వర్షంలో తడిసె సంద్రంలాగా
ఊరేగే పువ్వులో చెలరేగే నవ్వుల్లో అంతా సౌందర్యమే
అన్ని నీ కోసమే
వెన్నెల్లో నడిచే మబ్బులాగా వర్షంలో తడిసె సంద్రంలాగా
నాలో ఎన్ని ఆశలు అలల్లా పొంగుతున్నవి
నీతో ఎన్ని చెప్పిన మరెన్నో మిగులుతున్నవి
కల్లాల్లోనే వాలి నీలాకాశం అంతా ఎలా వొదిగిందో
ఆ గగనాన్ని ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
నక్షత్రాలన్నీ ఇలా కళలయ్యి వొచ్చాయి
చూస్తూనే నిజమయ్యి అవి ఎదుటే నిలిచాయి
ఆణువణువూ అమృతంలో తడిసింది అద్భుతంగా
వెన్నెల్లో నడిచే మబ్బులాగా వర్షంలో తడిసె సంద్రంలాగా
ఇట్టే కరుగుతున్నది మహా ప్రియమైన ఈ క్షణం
వెనకకు తిరగనన్నది ఎలా కాలాన్ని ఆపడం
మదిల మంటే ఈడు తీయని శృతిగా మారి ఎటో పోతుంటే
కావాలంటే చూడు నీ ఆనందం మనతో తాను వస్తుంటే
ఈ హాయి అంత మహా భద్రంగా దాచి
పాపాయి చేసి నా ప్రాణాలే పోసి నూరేళ్ళ కానుకల్లే
ని చేతికియ్యలేనా
ఆకాశం అంతఃపురమైంది నా కోసం అందిన వరమైంది
రావమ్మా మహారాణి ఏలమ్మ కాలాన్ని అంది ఈ లోకమే అంత సౌందర్యమే
ఆకాశం అంతఃపురమైంది నా కోసం అందిన వరమైంది