బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము
తలకగా గగనము తన్నిన పాదము
తలకగా గగనము తన్నిన పాదము బలారిపు గాచిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
పరమయోగులకు పరిపరి విధముల పారమొసగెడి నీ పాదము
తిరువెంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము