జాబిల్లీ రావే వెండి జాబిల్లీ
నీతోనే ఉంటానమ్మా జాబిల్లీ
నిన్నే కోరింది వెండి జాబిల్లీ
నీ తోడై ఉంటానంది మానసిచ్చి
మబ్బులో దాగి దోబూచి ఆడి
నా ముందే ఉంటూ నా మనసే దోచి
నీ ఎదలో చోటిచ్చావే
నవ్వులు కురిపించి
నిన్నే కోరింది వెండి జాబిల్లీ
నీతోనే ఉంటానమ్మా జాబిల్లీ
దొర దొర ఈడు తోడులేక నేడు
ఉసురు ఉసురు అన్నది చూడు
కోరిందే నీ తోడు
కొంటె కళ్ళ చూపు గుచ్చుకున్న నాడు
రేగదా మరి జోరు ఆగదే గా పోరు
నా వెంటే చెలి నువుంటే
ఇంకేమి కోరాను లే
అవునన్నా నువ్వు కాదన్నా
నే నీలో సగమే లే
ఆఆ మాటే చాలమ్మ నీ నీడై ఉంటా లే
నిన్నే కోరింది వెండి జాబిల్లీ
నీతోనే ఉంటానమ్మ జాబిల్లీ
వెన్నెలంటి నువ్వు వెన్నపూస మనసు
చూసి నీలో నేను చేరువయ్యా నీకు
పాలరాతి బొమ్మ పైడిపూల కొమ్మ
దేవతాంటే ఎవరో చూసాను నీలో నేడు
బతుకంతా నీ జతగా
ఉండే వారమే ఇచ్చావే
బడిలో చదివే ఆ నాడే
నా యదలో చేరావే
నీ వొడిలో గువ్వలై కలకాలం ఉంటాలేయ్
జాబిల్లీ రావే వెండి జాబిల్లీ
నీతోనే ఉంటానమ్మా జాబిల్లీ
నిన్నే కోరింది వెండి జాబిల్లీ
నీ తోడై ఉంటానంది మానసిచ్చి
మబ్బులూ దాగి
ఆఆఆఆ
దోబూచి ఆడి
ఓఓఓఓఓ
నా ముందే ఉంటూ నా మనసే దోచి
నీ ఎదలో చోటిచ్చావే
నవ్వులు కురిపించి
నిన్నే కోరింది వెండి జాబిల్లీ
నీతోనే ఉంటానమ్మా జాబిల్లీ