ఏ మంత్రమో అల్లేసిందిలా
ఎదకే వేసే సంకెలా
భూమెందుకో వణికిందే ఇలా
బహుశా తనలో తపనకా
ఆకాశం రూపం మారిందా
నా కోసం వానై జారిందా
గుండెల్లో ప్రేమై చేరిందా
ఆ ప్రేమే నిన్నే కోరిందా
మబ్బుల్లో ఎండమావే
ఎండంతా వెన్నెలాయె
మనసంతా మాయ మాయే
ఐనా హాయే
క్షణము ఒక ఋతువుగ మారే
ఉరుము ప్రతి నరమును తరిమే
పరుగులిక వరదలై పోయే కొత్తగ
ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే
పగలు వల విసిరె ఉహలె
మనసు మతి చెదరగ శిలగ నిలిచెగా
కళ్ళల్లో కదిలింద కలగా కల కరిగిపోకలా
ఎదురయ్యే వేళల్లో నువు ఎగిరి పోకలా
ఓ మాయలా ఇంకో మాయలా
నన్నంత మార్చేంతలా
ఓ మాయలా ఇంకో మాయలా
నువ్వే నేనయ్యేంతలా వెన్నెల్లా