నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం
వెల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం
వెల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
నా కలలని కన్నది నీవే
నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం ఇష్టం నీవే
చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికావె
కన్నీరే వస్తే కొంగై తుడిచావే
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
నే గెలిచినా విజయం నీదే
నే ఓడిన క్షణం ఓదార్పే
నా అలసట తీరే దారే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ
ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే
ధన్యోస్మి అంటూ దండం పెడతాలే
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం
వెల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం
వెల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా