పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
పన్నీటి స్నానాలు చేసే వేళలో
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నాను అల్లరి పెట్టె
కనరాని బాణాలు తాకే వేళలో
చెయ్యెత్తు తున్నాము శ్రీతంగా సామి
చెయ్యున్న సాయంగా అందియ్యవేమి
నా ప్రేమ సామ్రాజ్య దేవి
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్య ధనం కాపాడగ నాదేలే హామీ
సరేనంటే రూపం తాపం సమర్పయామి
నీ సన్నిధిలోనే సమస్తము నీదే దయామి
కునుకుండదు కన్నులలోన
కుదురుండదు గుండెలలో
ఆణువణువూ కోరుకుతున్నది తీయని మైకం
ఎదిగొచ్చిన వన్నెల వాన
వోదిగున్నది ఒంపులలో
చేరానోదిలి వూరుకుతున్నది వయసు వేగం
మనసు పడే కానుక అందించన ప్రేమిక
దహించితే కోరిక సహించాకే గోపిక
అదిరేటి అధరాల ఆన
అందం చందం అన్ని నీకే సమర్పయామి
ఆనందం అంటే చుపిస్తాలే చెలి ఫాలో మీ
పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
నున్నని చెంపకి సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నాను అల్లరి పెట్టె
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్య దానం కాపాడగ నాదేలే హామీ
నులివెచ్చని ముచ్చటలోనా
తొలి ముద్దులు పుచ్చుకొని
సరిహద్దులు దాటాకే ఒంటరి కిన్నెరా సాని
నును మెత్తని సోయగమంతా
సరికొత్తగా విచ్చుకుని
ఎదురొచ్చిన కాముని సేవకు అంకితమవని
అవి ఇవి ఇమ్మని అదే పనిగా వెడని
ఇహం పరం నువ్వని పదే పదే పాడని
తెరచాటు వివరాలు అన్ని
దేహం దేహం తాకే వేళా సంతర్పయామి
సందేహం మొహం తీరేవేళ సంతోషయామి
పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
పన్నీటి స్నానాలు చేసే వేళలో
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నాను అల్లరి పెట్టె
కానరాని బాణాలు తాకే వేళలో
చెయ్యెత్తు తున్నాము శ్రీతంగా సామి
చెయ్యున్న సాయంగా అందియ్యవేమి
నా ప్రేమ సామ్రాజ్య దేవి
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్య ధనం కాపాడగ నాదేలే హామీ