ఇంతకన్నా మంచి పోలికేది
నాకు తట్టలేదు గాని ఆమ్మో
ఈ లవ్ అనేది బబుల్-ఉ గం-మ్మో
అంటుకున్నదంటే పోదు నమ్మో
ముందు నుంచి అందరన్న మాటే గాని
మల్లి అంటన్నానే ఆమ్మో
ఇది చెప్పకుండా వచ్చే తుమ్మో
ప్రేమనాపలేవు నన్ను నమ్మో
ఎట్టాగ నాయీ ఎదురు చూపుకి
తగినట్టుగా నువ్వు బూతులు చెబితివే
అరేయ్ దేవుడా ఇదేందనలెంత లోపటె
పిల్లాడట దెగ్గరయి నిన్ను చేరదీస్తివే
బుట్టబొమ్మ బుట్టబొమ్మ
నన్ను సుట్టుకుంటివే
జిందగీకెయ్ అట్టబొమ్మై
జంట కట్టుకుంటివే
బుట్టబొమ్మ బుట్టబొమ్మ
నన్ను సుట్టుకుంటివే
జిందగీకెయ్ అట్టబొమ్మై
జంట కట్టుకుంటివే
మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగ
మౌనంగున్న గాని అమ్మో
లోన దండనక జరిగిందే నమ్మో
దిమ్మ దిరిగినదే మైండ్ సిం -మ్మో
రాజుల కాలం కాదు
రథము గుర్రం లేవూ
అద్దం ముందర నాతో నేనే
యుద్ధం చేస్తానంటే
గాజుల చేతులు జాపి
దెగ్గరకొచ్చింది నువ్వు
చెంపల్లో చిటికేసి
చెక్కరవద్ధిని చేసావే
చిన్నగా చినుకు తుంపరడిగితేయ్
కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా ఓ మల్లెపువ్వునడిగితేయ్
మూటగా పూల తోటగా పైనొచ్చి పడితివే
బుట్టబొమ్మ బుట్టబొమ్మ
నన్ను సుట్టుకుంటివే
జిందగీకెయ్ అట్టబొమ్మై
జంట కట్టుకుంటివే
వేలి నిండా నన్ను తీసి
బొట్టు పెట్టుకుంటివే
కాళీ కిందికి పువ్వు నేను
నెత్తినెట్టుకుంటివే
ఇంతకన్నా మంచి పోలికేది
నాకు తట్టలేదు గాని ఆమ్మో
ఈ లవ్ అనేది బబుల్-ఉ గం-మ్మో
అంటుకున్నదంటే పోదు నమ్మో
ముందు నుంచి అందరన్న మాటే గాని
మల్లి అంటన్నానే ఆమ్మో
ఇది చెప్పకుండా వచ్చే తుమ్మో
ప్రేమనాపలేవు నన్ను నమ్మో