చిటపట చినుకులు అరచేతులలో
ముత్యాలైతే అయితే అయితే
తరగని సిరులతో తల రాతలనే
మార్చేస్తుంటే ఇట్టె ఇట్టె
అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడు
ఓ వాన నువ్వొస్తానంటే
నిధులకు తలుపులు తెరవగ
మనకొక అలీ బాబా ఉంటె
అడిగిన తరుణమే పరుగులు తీసే
అల్లావుద్దీన్ జెనీ ఉంటె
చూపదా మరి ఆ మాయదీపం
మన ఫేటే ఫ్లైట్ అయ్యే రన్వే
నడిరాత్రే వస్తావె స్వప్నమా
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా
ఊరికినే ఊరిస్తే న్యాయమా
సరదాగా నిజమైతే నష్టమా
మోనాలిసా మొహం మీదే నిలుస్తావా
ఓ చిరునవ్వా ఇలా రావా
వేకువనే మురిపించే ఆశలు
వెనువెంటనే అంతా నిట్టూర్పులు
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులు
ఇలాగేనా ప్రతి రోజు ఎలాగైనా
ఏదో రోజు మనదై రాదా
చిటపట చినుకులు అరచేతులలో
ముత్యాలైతే అయితే అయితే
తరగని సిరులతో తల రాతలనే
మార్చేస్తుంటే ఇట్టె ఇట్టె