మనసా మన్నించమ్మా
మార్గం మళ్ళించమ్మా
నీతో రాని నిన్నల్లోనే
శిలవై ఉంటావా
స్వప్నం చెదిరిందమ్మా
సత్యం ఎదురుందమ్మా
పొద్దే లేని నిద్దర్లోనే
నిత్యం వుంటావా
ప్రేమ ప్రేమ నీ పరిచయం
పాపం అంటే కాదనలేవా
ప్రేమ ప్రేమ నీ పరిచయం
పాపం అంటే కాదనలేవా
ప్రేమాలయంలా వుంటే నీ తలపు
ప్రేమే దైవంలా కొలువుంటుందమ్మా
దావానలంలా తరిమే నిట్టూర్పు
ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా
అంత దూరం ఉంటేనే
చందురుడు చల్లని వెలుగమ్మ
చెంతకొస్తే మంటేలే
అందడని నిందించొద్దమ్మా
మన క్షేమం కోరుకునే
జాబిలే చెలిమికి చిరునామా
తన సౌఖ్యం ముఖ్యమనే
కాంక్షలో కలవరపడకమ్మా
ప్రేమ ప్రేమ నీ స్నేహమే
తీయని శాపం మన్నిస్తావా
ఒక చినుకునైన దాచడు తనకోసం
నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం
నదులన్నీ తానే తాగే ఆరాటం
కడలికి తీర్చేనా దాహం ఏ మాత్రం
పంజరంలో బంధించి
ఆపకే నేస్తాన్నేనాడు
పల్లకిపై పంపించి
చల్లగ దీవించవే నేడు
జ్ఞాపకంలో తియ్యదనం
చేదుగా మార్చవ కన్నీళ్లు
జీవితంలో నీ పయనం
ఇక్కడే ఆపకు నూరేళ్ళు
ప్రేమ ప్రేమ మదిలో భారం
కరిగించేలా ఓదార్చవా
Manasa manninchamma
Margam mallinchamma
Neetho rani ninnallone
Silavi vuntavaaaa
Swapnam chedirindamma
Satyam yedarundamma
Podde leni niddarlone
Nityam vuntavaaa
Prema prema nee parichayam
Papam ante kadanalevaa
Prema prema nee parichayam
Papam ante kadanalevaa
Premalayamla vunte nee talapu
Preme divamla koluvuntundamma
Davanalamla tarime nitturpu
Premanu nee nunchi velivestundamma
Antha duram vuntene
Chandurudu challani velugamma
Chenthakosthe mantele
Andadani nindinchoddamma
Mana kshemam korukune
Jabile chelimiki chirunamaa
Tana soukhyam mukhyamane
Kankshalo kalavarapadakammaa
Prema prema ne snehame
Teeyani shapam mannistaavaa
Oka chinukunina dachadu tanakosam
Nelaku neerichi murise akasam
Nadulanni taane taage araatam
Kadaliki teerchena daham ye mathram
Panjaramlo bandhinchi
Aapake nesthannenadu
Pallakipi pampinchi
Challaga deevinchave nedu
Gnapakamlo tiyyadanam
Cheduga marchava kanneellu
Jeevithamlo nee payanam
Ikkade aapaku nurellu
Prema prema madilo bharam
Kariginchela odarchavaaa