మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే
మౌనం లో ఆగలేని ఎద ఎగిసింది
మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే
మౌనం లో ఆగలేని ఎద ఎగిసింది
ఇన్నాళ్లుగా నాలో ఉంది నాకు తెలియలేదే
ఇప్పుడిప్పుడే గుండె చప్పుడై నన్ను కలుసుకుందే
ఓ నా ప్రేమ
ఔనా నా ప్రేమ
మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే
మౌనం లో ఆగలేని ఎద ఎగిసిందే
ఎప్పుడెప్పుడంటూ తరిమిందే
నన్ను పదమంటూ నీ
వైపే ఆరాటమే నన్నిలా
ఎక్కడెక్కటంటూ వెతికిందే
నిన్ను వీడనంటూ నా
చూపే నీకోసమే ఇంతలా
ఏమి చేసిన ఏది చూసిన
తనివి తీరక
ఎంత ఆపిన వింత
మాయలో అడుగు ఆగక
నీ ఊహల వెన్నెల దారిలో
ఆశలు ఎగురుతున్నవే
మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే
మౌనం లో ఆగలేని ఎద ఎగిసిందే
చిన్నదైనాగాని ఒక మాట
చిచ్చుపెడుతుంటే ఈపూట
నీతోటి చెప్పేదెలా
కళ్ళుమూసుకున్న కనిపించే
ఎన్ని కళలంటే నా వెంట
నీతోటి పంపేదెలా
రెప్ప చాటున రెక్క
విప్పిన చిలిపి కోరిక
రేయి దాటినా జోల
పాడిన నిదురపొధీక
నీ నవ్వుల పూవ్వుల తేనెలు
నా ఎద వెతుకుతున్నదే
మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే
మౌనం లో ఆగలేని ఎద ఎగిసిందే
ఇన్నాళ్లుగా నాలో ఉంది నాకు తెలియలేదే
ఇప్పుడిప్పుడే గుండె చప్పుడై నన్ను కలుసుకుందే
ఓ నా ప్రేమ
ఔనా నా ప్రేమ