కనులు కళలు పిలిచే
నిదుర తలపు తెరిచే
మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే
మేఘాల్లోతెలి ని చెంత
వాలి మనసా ఓ
ఈ చల్ల గాలి పాడింది
లాలి తెలుసా ఓ
కనులు కళలు పిలిచే
నిదుర తలపు తెరిచే
మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే
బదులు రాని పిలుపు లాగ
గతము మిగిలిన
విడిచిపోని గురుతులాగా
అడుగు కలపన
తెలుపలేని తపనలేవో
ఏదని తొలిచిన
మరుపురాని మమతాలాగా
ఎదుట నిలవన
బతుకులోని బరువులన్ని
వదిలి కదిలిపో
కలత తీర కళలు
చేరి ఒదిగి ఒదిగి పో
నిదుర పో నిదుర పో
నిదుర లో కలిసి పో
అలసి సొలసి నిదుర
నాడిన కునుకు పడవ
కనులు కళలు పిలిచే
నిదుర తలపు తెరిచే
మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే
ఎవరు నీవు ఎవరు నేను
ఎవరికెవరులే
మధురమైన వరము ఎదో
మనని కలిపేలే
చెదిరిపోయే ఎగిరిపోయి
వెలుగు ముగిసిన
నిశిని దాటి దిశలు
మారే ఉదయమవునులే
శిశిరమైన పసిడి పూలు
మరల పూయ్యులే
శిధిలమైన హృదయ వీధి
తిరిగి వెలుగులే
తెలుసుకో తెలుసుకో
మనసునే గెలుచుకో
మనసుగెలిచి తెగువ మరచి
కళలు కనవ
కనులు కళలు పిలిచే
నిదుర తలపు తెరిచే
మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే
మేఘాల్లోతెలి ని చెంత
వాలి మనసా ఓ
ఏ చల్ల గాలి పాడింది
లాలి తెలుసా ఓ
కనులు కళలు పిలిచే
నిదుర తలపు తెరిచే
మనసు పరుపు పరిచే
చెలిమి జతగా నిలిచే