కవ్వం చిలికినట్టే గుండెల్ని కెలికేస్తివే
యుద్ధం జరిగినట్టే ప్రాణాలు కుదిపేస్తివే
పాల సంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు
ముత్తెంలా ఉన్నావే ముక్కట్టు
కొన్ని అందాలు చూపెట్టు ఇంకొన్ని దాపెట్టు
మొత్తంగా నా నోరే ఊరేట్టు
పిల్ల పులి పిల్ల పులి
పోరాగాడే నీకు బలి
ఎర వేశావే సంకురాతిరి సోకుల సంపదని
నరికేసావే నా రాతిరి నిద్దరనీ
బంగాళాఖాతంలో పడ్డావే బంతి రెక్క
ఎంతెంతా తూఫాను రేపావే తస్సచక్క
నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి నీ పదనిస పాడిస్తివే
అల్లాడించావే ఏ ఏ ఏ
పిల్లా నచ్చావే ఏ ఏఏ హోయ్
నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి నీ పదనిస పాడిస్తివే
ఏ ఏఏ ఏ
చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా నన్నట్టా పెట్టేసుకో
పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా నీ జంట తిప్పేసుకో
నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె తడవాలి నా కలా
నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే నా పాలి వెన్నెలా
పిల్లా భూమికొక్క పిల్లా
ఎల్లా నిన్ను ఒదిలేదెల్లా హోయ్
నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి నీ పదనిస పాడిస్తివే
మామూలు మాటైనా కొట్నట్టు తిట్నట్టు మా ముక్కుసూటిలే
నిన్నట్టా చూస్తాంటే నన్నే చూస్తానట్టు కేరింతలైతినే
హో నీలాంటి పిల్లమ్మి మల్లొచ్చి నా కంట పడతాదో లేదో లే
ఓ వెయ్యి జనమాలు ఆలస్యం అయితేనేం నీ కోసం చూస్తానే
సొట్ట బుగ్గ పిట్టా నీకు తాళి కట్టా
ఇట్టా ముందుగానే పుట్టా
హోయ్ నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి నీ పదనిస పాడిస్తివే
ఎర వేశావే సంకుతాతిరి సోకుల సంపదని
నరికేసావే నా రాతిరి నిద్దరనీ
బంగాళాఖాతంలో పడ్డావే బంతి రెక్క
ఎంతెంత తూఫాను రేపావే తస్సచక్కా