పందిరి వేసిన ఆకాశానికి యివమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకు యివమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా
విడాకుల పత్రిక అందుకుని జంటని వేరు చేయూమ్మ
దంపతులు విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకో వామ్మ
పందిరి వేసిన ఆకాశానికి యివమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకు యివమ్మా ఆహ్వానం
ప్రతి మనువు స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడ గొడుతుందా
నీ రాతకు యెంత సత్యం ఉందొ చూతుము బ్రహ్మయ్యా
నీ సాక్షం యెంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
నువ్వు రామ్మా ఓ అరుంధతి
ఇదే నీ దర్శన బలం ఐతే ఎటైనా దాగి పోవమ్మా
నిజంగ పెళ్ళికి బలం ఉంటె చూటీగా యిటు దిగిరావమ్మ
పందిరి వేసిన ఆకాశానికి యివమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకు యివమ్మా ఆహ్వానం
చితి మంటల సహగమనం ఒకసారే బలి చేస్తుంది
పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది
ఆ జ్వాలాల తోనే జీవించేటి ధైర్యం అందిస్తూ
ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు
నువ్వు రామ్మా మాంగల్యమా
వివాహపు వేదికలో నిన్ను మూడేసి నిన్నటి వేళ్ళకి
విడాకులా వేడుకలో నేడు తెంపడం నేర్పడానికి
పందిరి వేసిన ఆకాశానికి యివమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకు యివమ్మా ఆహ్వానం
Pandhiri Vesina Aakashaniki Yivamma Aahwanam
Peetanu Vesina Ee Nelammaku Yivamma Aahwanam
Nuvvu Raamma O Vedhama
Vidakula Patrika Andukunni Jantane Veru Cheyummma
Dampatullu Vidadise Mantram Kotaga Nerchuko Vammma
Pandhiri Vesina Aakashaniki Yivamma Aahwanam
Peetanu Vesina Ee Nelammaku Yivamma Aahwanam
Prati Manuvu Swargamlo Munumunde Mudibadutundhi
A Maate Nijamaite Ee Chattam Vida Godutunda
Nee Raataku Inta Satyam Undo Chootumu Brahmaiya
Nee Saksham Yenta Villuvaindo O Agni Choodaiya
Nuvvu Raamma O Arundati
Ide Nee Darshana Balam Aite Yettaina Daagi Povamma
Nijam Ga Pelliki Balam Unte Chootigi Yitu Digiraavamma
Pandhiri Vesina Aakashaniki Yivamma Aahwanam
Peetanu Vesina Ee Nelammaku Yivamma Aahwanam
Chithi Mantala Sahagamanam Okasaare Bali Chestundi
Pati Vidichina Satigamanam Prati Nimisham Ragilistundi
A Jvallalalo Tone Jeevincheti Dhairyam Andhistu
O Bandhuvulaara Dheevinchandi Deergasahanamastu
Nuvvu Raamma Maangalyama
Vivahaku Vedikalo Ninnu Mudesina Ninnati Vellaki
Vidaakalla Vedukalo Nedu Tempadam Nerpadaaniki
Pandhiri Vesina Aakashaniki Yivamma Aahwanam
Peetanu Vesina Ee Nelammaku Yivamma Aahwanam