సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ
హాయ్ హాయ్
సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే చిత్రాపతీ
నిన్ను కోరి పుట్టేస్తి
పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి
నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి
చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ
ఇంటి పేరు కూడా మార్చేస్తి
నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల
బొట్టూ పెడితివే
అరెరెరే పిల్లా నీ అందం అదిరే నవలా
రోజు ఓ కొంచం చదివెయ్ కధలా
పక్కనువ్వుంటే పగలే వెన్నెలా
ప్రేమే మార్చిందా కవిలా నిన్నిలా
నీ పేరు పెట్టుకునీ
అందాల తుఫానునీ
ముంచెత్తి వెళ్ళమనీ
డైలీ రప్పిస్తా
కొండంత నీ ప్రేమని
ఏ చోట దాచాలనీ
ప్రపంచ బ్యాంకులనీ
లాకార్లిమ్మని అడిగేస్తా
పొద్దు పొడుపే నువ్వంటూ
నిద్దరంటూ రాదంటూ
కొన్ని కోట్లు కన్నాలే నీ కలలే
దివిలాగ నేనుంటే
అస్తమానం నా చుట్టూ
ఆ వైపు ఈ వైపు
నీ ఆలోచన్ల అలలే
నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల
బొట్టూ పెడితివే
సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ
హాయ్ హాయ్
సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే చిత్రాపతీ
నిన్ను కోరి పుట్టేస్తి
పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి
నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి
చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ
ఇంటి పేరు కూడా మార్చేస్తి
నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల
బొట్టూ పెడితివే