అందమా అందమా
నువ్వు నా సొంతమా
స్నేహమా మోహమా
తేల్చవా ప్రాణమా
నీ పరిచయం ఓ చిత్రమా
నీ దర్శనం ఆ చైత్రమా
నీ సన్నిధే సౌఖ్యమా
నాతో అడుగులు వేస్తావా ఓ ప్రేమా
నీ జత లేక నిలవడమిక నా తరమా
అందమా అందమా
నువ్వు నా సొంతమా
స్నేహమా మోహమా
తేల్చవా ప్రాణమా
ఏ నడిరేయి నీ ఊహల్లోనే కనుతెరిచినా
నీ చిరునవ్వు లో ఉదయాలు నా దరిచేరెనా
నా జాముల్లో నీ స్వప్నాలు ఆ హరివిల్లులా
ఈ గుండెల్లో నీ వర్ణాల రూపం నింపెనా
మనసు తలుపు తెరిచి ఎదురు చూశా
కలల బరువు కనుల వెనక మోశా
ఒకరికొకరు బయట పడని వేళ
ఎవరు తెలుపగలరు కడకు వలపునిలా
ఆరదీ జ్వాలా
వెన్నెలా వెన్నెలా
కురిసె నా కన్నులా
మంచులా మాయలా
కమ్మెనా ఈ కలా
నీ పలుకులే సంగీతమా
నీ రాక వాసంతమా
నీతో అడుగులు వేస్తుందా ఈ ప్రేమా
నీ జతలో గడిపే ఈ క్షణమే నిజమా
అందమా అందమా
నువ్వు నా సొంతమా
స్నేహమా మోహమా
తేల్చవా ప్రాణమా