నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్న
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్న
నెలవంకను ఇద్దమనుకున్న
హో నీ నవ్వుకు సరిపోదంటున్న
నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నెలకే
నువ్వే వదిలేటి శ్వాసకు
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అంధగత్తెకి ఏమి ఇవ్వనే
నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్న
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్న
హో వానవిల్లులో ఉండని రంగు నువులే
ఏ రంగుల చీరను నీకు నేయలే
నల్ల మబ్బుల మెరిసే కళ్ళు నీవిలే
ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలె
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువన్తా చుక్కను పెట్టాలె
ఎదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాధికా అంటూ ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా
నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్న
నీ హృదయం ముందర ఆకాశం చిన్నదంటున్న
ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలె
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీధీ
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలె
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వరమోసిగే దేవుడికే నేనేం తిరిగివ్వలే
ఎదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాధికా అంటూ అలీసాను పూర్తిగా
కనుకే మల్లి మల్లి జన్మనెత్తి నిన్ను చేరన
నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్న
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్న