ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
కనీవినీ ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం
దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం
నింగినీ నేలనీ వానచినుకులై కలిపేను స్నేహం
తూర్పుకీ పడమరకీ కాంతి తోరణం అయ్యిందీ స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
కనీవినీ ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం
దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం
హో నీ ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి
నీ పాదం తాకాలంటూ అలలైంది ఆ కడలి
తన మచ్చను నీ స్వచ్చతతో కడగాలంది జాబిలి
నీ భరణం మోసేటందుకే పుట్టానంది ఈ పుడమే
ఆశలు ఆకర్షణలు లేనిది నీ ఆడ మగ స్నేహం
నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఓ తన చూపులు నువ్వు చూస్తుంటే
నీ కళలను తాను కంటోంది
తను మాటలు నువ్వుంటుంటే
నీ నవ్వులు తను నవ్వింది
తాను అడుగులు వేస్తూ ఉంటే
గమ్యం నువ్వే చేరేవు
నీలో నువ్వు చేయని పనులే
నీలా తానే చేసేను
జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం
దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం